Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ‘‘అణు యుద్ధం’’గా మారే సంఘర్షణను, వాణిజ్యం ద్వారా తాను ఆపానని సోమవారం ట్రంప్ మరోసారి అన్నారు. ‘‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము చాలా విజయాలు సాధించాము. భారత్-పాకిస్తాన్ ఉన్నా్యి. 30 ఏళ్లుగా కొనసాగుతున్న రువాండా-కాంగో ఉన్నాయి’’ అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ రుట్టేతో జరిగిన సమావేశంలో అన్నారు.
MLC Kavitha : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ దాడులకు దిగింది. అనంతరం పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారత్‌పై దాడికి దిగడంతో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్త వాతావరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సాంత్వనకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ…
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాక్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఈ అంశంపై పాక్ మంత్రి స్పందించారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తక్షణ కాల్పుల విరమణను ధృవీకరించారు. భారతదేశం -పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయంపై ఇరు దేశాలు అంగీకరించాయి. “పాకిస్థాన్-భారత్ తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రాజీ పడలేదు. దేశంలో శాంతి, భద్రత కోసం…