Mohan Bhagwat: భారతీయ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని పునరుద్ఘాటించారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. అమెరికా సుంకాలు భారతదేశానికి పెద్ద సవాలుగా మారాయన్నారు. దీని ప్రభావం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. స్వావలంబన అంశాన్ని ప్రస్తావించారు. స్వదేశీ,…
Donald Trump: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్‌పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా…
Foreign Investors Withdraw: భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. ఒక ఆగస్టు నెలలోనే దలాల్ స్ట్రీట్ నుంచి రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మొదటి త్రైమాసికంలో కంపెనీల బలహీన ఫలితాలు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు ఆగడం లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా మార్కెట్లో కూడా చాలా ఒత్తిడి కనిపిస్తోందని అన్నారు. గత వారంలో స్టాక్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్‌పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.
భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…