Tariffs War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచారు. మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలలు పాటు టారిఫ్స్‌ని నిలిపేసింది. కానీ, చైనాకు మాత్రం అమెరికా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. చైనా ఉత్పత్తులపై యూఎస్ విపరీతమైన సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే, చైనా కూడా అంతే ధీటుగా అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతూ పోతోంది.
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రెండు అతి పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య టిట్-ఫర్-టాట్ టారిఫ్ వార్ కొనసాగుతుంది.. ఇకపై ఏదీ పూర్తిగా వ్యాపారం కాదు.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమైనదని అన్నారు.