కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) లోకి మరో నటి అడుగుపెడుతోంది. తన తొలి సినిమాతోనే అగ్ర కథానాయకుడి సరసన అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నటి దీప్‌శిఖ చంద్రన్. నటుడు కిచ్చా సుదీప్ సరసన ఆమె కన్నడ తెరపై మెరవబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా నటీమణులకు గుర్తింపు రావడానికి కొన్ని సినిమాలు పడుతుంది. కానీ దీప్‌శిఖ తన మొదటి సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆమె…