Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఘజియాబాద్‌కు చెందిన 52 ఏళ్ల ధరమ్‌వీర్‌కు భార్య సుందరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ధరమ్‌వీర్ రోజువారీ కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిసున్నాడు. భార్య సుందరి కూడా పనులకు వెళుతూ అతడికి సాయపడేది. ధరమ్‌వీర్‌కు రోజుకు 6-7 సార్లు టీ తాగే అలవాటు ఉంది. మంగళవారం (డిసెంబర్ 19) ఉదయం ధరమ్‌వీర్ నిద్రలేవగానే.. వంటగదిలో ఉన్న భార్య సుందరిని ఓ కప్పు టీ అడిగాడు. ఐదు నిమిషాల తర్వాత ధరమ్‌వీర్ వంటగదిలో ఉన్న సుందరి వద్దకు వచ్చి.. టీ ఏదని అడిగాడు. రెడీ చేస్తున్నా.. ఓ పది నిమిషాలు ఆగమని సుందరి చెప్పింది.
Also Read: Mumbai Indians: ఆందోళన వద్దు.. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడు!
టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు కోపోద్రిక్తుడైన ధరమ్‌వీర్.. కత్తి తీసుకొచ్చి భార్య సుందరిపై వెనుక నుంచి దాడి చేశాడు. తల్లి అరుపులు విని మరో గదిలో నిద్రిస్తున్న పిల్లలు పరుగెత్తుకు రాగా.. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం చూసి షాక్‌కు గురయ్యారు. కోపంతో ధరమ్‌వీర్ పిల్లల వైపు వెళ్లగా.. వారు గదిలోకి పరుగెత్తారు. తీవ్ర రక్తస్రావం అయిన సుందరి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.