Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.