ఇవ్వాళ వచ్చే గెస్ట్స్ చాలా యంగ్ అట కదా సార్..." అంటూ 'ఆహా' మెంబర్ ఒకరు బాలకృష్ణను అడగ్గానే, "అవునమ్మా నా వయసు వాళ్ళే వస్తున్నారు..." అంటూ ఆయన సమాధానమివ్వడంతో 'అన్‌స్టాపబుల్' సీజన్ 2లోని ఎపిసోడ్ 2 మొదలవ్వడమే జనానికి హుషారు నిచ్చింది.
Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ ప్రతిష్టాత్మకంగా ఈ షోను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ షో సీజన్ 1 భారీ విజయాన్ని అందుకొంది. స్టార్ల యాక్షన్.. బాలకృష్ణ రియాక్షన్స్.. కౌంటర్లు, సెటైర్లు, పంచులు.. అబ్బో ప్రేక్షకులకు వినోదమే వినోదం.