Domestic LPG cylinders to come with QR codes soon: ఎల్పీజీ సిలిండర్లు త్వరలో క్యూఆర్ లతో వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. ఈ కోడ్ ఆధారంగా సిలిండర్లను ట్రాకింగ్, ట్రేసింగ్ సులభం అవుతుందని ఆయన అన్నారు. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా రెగ్యులేట్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ విధానం సహకరిస్తుందని వెల్లడించారు. సిలిండర్ల నిర్వహణ కూడా బాగుంటుందని ఆయన అన్నారు.