తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ప్రధానితో పాటు 72 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి ప్రధాని మోడీ టీమ్‌లో చాలా మంది పాత ముఖాలకు మళ్లీ అవకాశం దక్కింది. మరి మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఎంత విద్యావంతులుగా ఉన్నారో తెలుసుకుందాం. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారిలో మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఎంబీఏ చదివారు. ప్రధాని…
మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కగా.. తొలిసారి బండి సంజయ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కింది.
ఆదివారం కొలువుదీరిన కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ శాఖలు కేటాయించారు. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. శాఖలు ఇవే.. నితిన్ గడ్కరీ – రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అమిత్ షా – కేంద్ర హోంశాఖ జయశంకర్ – విదేశాంగ శాఖ మనోహర్ లాల్ కట్టర్ – హౌసింగ్ అండ్ అర్బన్ నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ చిరాగ్ పాశ్వాన్ – యువజన వ్యవహారాలు మరియు…
CM Revanth Reddy: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు.