అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు…