ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ 'చారిత్రాత్మకం' అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు.