జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్‌లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది.. ఫస్ట్ వేవ్ కంటే.. భారీగా కేసులు, ఎక్కువ సంఖ్యలో మృతులు కలవరానికి గురిచేశాయి.. బెడ్లు, ఆక్సిజన్ దొరకక అల్లాడిపోయిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. క్రమంగా కేసులు దిగివచ్చాయి.. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. కరోనా వ్యాప్తిని…