వ్యాక్సినేషన్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేసింది.. ఫస్ట్ వేవ్ కంటే.. భారీగా కేసులు, ఎక్కువ సంఖ్యలో మృతులు కలవరానికి గురిచేశాయి.. బెడ్లు, ఆక్సిజన్ దొరకక అల్లాడిపోయిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. క్రమంగా కేసులు దిగివచ్చాయి.. ఇక, చికిత్సపై నుంచి వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైనదంటూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. లాక్‌డౌన్‌కు స్వస్తి చెప్పి అన్‌లాక్‌లోకి వెళ్తున్న సమయంలో.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించడం, టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాకినేట్ స్ట్రాటజీని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపవద్దని సూచించారు. పరిస్థితులను కూలంకషంగా అంచనా వేసిన తర్వాతే ఆంక్షలను విధించాలా, సడలించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరింది కేంద్రం.
Also Read
- Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
- Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
- Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
తాజావార్తలు
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!