ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో మరోసారి భారత్‌పై విరుచుకుపడిన కరోనా మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో, కోవిడ్ ఆంక్షలను కూడా ఎత్తివేసింది ప్రభుత్వం.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర…
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు.. కోవిడ్ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి.. గత వారం వరకు 7వేల లోపు నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. మళ్లీ పది వేలు దాటి 15 వేల వైపు పరుగులు పెడుతోంది… తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 268 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒమిక్రాన్ కేసులు కూడా వెయ్యికి…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.. క్రమంగా అన్ని తెరచుకుంటున్నాయి.. ఈ తరుణంలో.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. భారత్‌ను కూడా ఈ కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. దీంతో.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఇక, రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది.. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కలవరపెడుతూనే ఉంది.. కేసులు తగ్గుతున్నా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్.. బయటపడింది.. ఇప్పటికే భారత్‌లో ఆరు, ఏడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుచూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తొలి కేసు నమోదైంది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తిరుపతికి చెందిన బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్‌గా తేలింది.. పుణెలోని సీసీఎంబీలో నిర్వహించిన పరీక్షల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు…