మళ్లీ కరోనా కల్లోలం.. ఆ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు.. కోవిడ్ కేసులు కూడా అమాంతం పెరిగిపోయాయి.. గత వారం వరకు 7వేల లోపు నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. మళ్లీ పది వేలు దాటి 15 వేల వైపు పరుగులు పెడుతోంది… తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 268 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒమిక్రాన్ కేసులు కూడా వెయ్యికి చేరువగా వెళ్తున్నాయి.. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు..
Read Also: జనవరి 2 వరకు ఆంక్షలు.. డీజీపీ కీలక ఆదేశాలు
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజాగా ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ.. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది.. కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. ఆస్పత్రులలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని సూచించింది.. ఇక, కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!