కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్లతో 8 ఏళ్ల కాలంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేయనుంది సర్కార్.. దీంతో, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం కూడా సులభం అవుతుందని…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ‍్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే, 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు.…