Income Tax: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులపై ‘‘ఆదాయపు పన్ను’’ తగ్గించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ప్రత్యేకించి అధిక జీవన వ్యయాలతో కూడిన నగరవాసులు, ఇంటి అద్దెల మినహాయింపు ఎంచుకునే వారికి కొత్త పన్ను విధానంలో ప్రయోజనం ఉంటుంది.
Read Also: Rohith Sharma On Yashasvi Jaiswal: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అంటూ రోహిత్ ఫైర్.. (వీడియో)
అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అదికారిక నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 01 కన్నా ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. పన్ను తగ్గింపు వల్ల ఆదాయం తగ్గినప్పటికీ, పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది ప్రజలు కొత్త వ్యవస్థను ఎంచుకునే అవకాశం ఉందని భావిస్తు్నారు. భారతదేశంలో తన ఆదాయపు పన్నులో ఎక్కువ భాగం రూ. 10 లక్షలు సంపాదించే వ్యక్తుల నుంచి పొందుతోంది.
మధ్యతరగతి చేతిలో ఎక్కువ డబ్బు ఉండటం వల్ల ఇది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు వీలవుతుంది. దేశీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, అధిక ఆహార ద్రవ్యోల్బణం నిత్యావసర వస్తువులు, వాహనాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వస్తువుల డిమాండ్‌ని కూడా తగ్గిస్తుంది. ప్రభుత్వం అధిక పన్నుల కారణంగా మధ్యతరగతి వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది, ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు కాస్త ఊరట ఇవ్వని తెలుస్తోంది.