JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్‌లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్‌కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘‘అణుశక్తి’’కి సంబంధించి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘విక్షిత్ భారత్ అణుశక్తి చాలా ముఖ్యమైందని’’ వ్యాఖ్యానించిన మంత్రి.. భారత్ ఇప్పుడు స్మాల్ రియాక్టర్లను, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడానికి, పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Mamata Banerjee: కేంద్ర బడ్జెట్ 2024-25పై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమని, ఎలాంటి దశ లేదని, ప్రజలకు వ్యతిరేకమైందని, దార్శనికత లేనిదిగా ఆమె అభివర్ణించారు.
కేంద్ర బడ్జెట్‌పై సీఎ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూన్నారన్నారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన పార్లమెంటు ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం తో జరిగిన నష్టం నుండి క్పడటానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుద…
Cigarette Prices: 2024 బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు పెంచలేదు. దీంతో సిగరేట్ల ధరలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. పొగాకుపై పన్ను రేట్లను పెంచకపోవడంపై, దేశంలో అతిపెద్ద సిగరేట్ ఉత్పత్తిదారు ఐటీసీ ఈ చర్యను స్వాగతించింది. బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల దీని షేర్లు 5 శాతం వరకు పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో ఈ స్టాక్ చివరిసారిగా 4.67% లాభంతో రూ. 488.35 వద్ద ట్రేడవుతోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024-25లో సమాజంలోని అన్ని వర్గాల పట్ల శ్రద్ధ చూపగా.. జైలు ఖైదీల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు.
కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని ఆయన తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. సబ్ కే సాథ్ సబ్ కా…
Gold rates drop: బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు తగ్గించారు.