యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.
యూనిఫాం సివిల్ కోడ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నది. ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని వారు వాదిస్తున్నారు. కానీ, అదే ముస్లిం మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన వాణి వినిపిస్తున్నట్లు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెజార్టీ ముస్లిం మహిళలు యూనిఫాం సివిల్ కోడ్‌కి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.
గుజరాత్‌కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు.
యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం నాడు కేంద్రాన్ని హెచ్చరించారు. ఇది అన్ని మతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడం ఆర్టికల్ 370 ని రద్దు చేసినంత సులభం కాదని కూడా అన్నారు.
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు.
Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూసీసీని తీసుకువచ్చే సమయం వచ్చిందని ఆయన మంగళవారం అన్నారు.
Uniform Civil Code: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ యూనిఫాం సివిల్ కోడ్’(యూసీసీ) బిల్లును ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
Uniform civil code: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ ‘యూనిఫాం సివిల్ కోడ్’ (యూసీసీ)పై భోపాల్ లో ఓ సభలో కామెంట్స్ చేసినప్పటి నుంచి దీనిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుంచి దీనిపై ప్రధానంగా వ్యతిరేకత వస్తోంది. అయితే ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని అన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూసీసీని తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.