మండు వేసవిలో అకాలవర్షాలు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు నిలువునా మునిగిపోయారు. కామారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీటిలో తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలగనుంది. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతులు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండల సబ్ధల్ పూర్, మల్లయ్య పల్లి కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కుప్పలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తూకం వేసిన…