Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.…