Car Fire Accident: ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం.. యువకుడు సజీవదహనం
- ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో..
- ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం.
- యువకుడు సజీవదహనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో కారులో కూర్చున్న యువకుడు కాలి బూడిదయ్యాడు. వాహనంలోంచి మంటలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఫార్చ్యూనర్‌లో ఉన్న యువకుడిని బయటకు తీయడానికి ప్రయత్నించినా బయటకు తీయలేక పోవడంతో సజీవదహనం అయ్యి చనిపోయాడు.
Read Also: Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. బంగారు రథంపై ఆది దంపతులు..
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ఇకపోతే చనిపోయిన ఆ యువకుడిని సంజయ్ యాదవ్‌గా గుర్తించారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతను ఘజియాబాద్‌లోని నెహ్రూ నగర్‌లో నివాసం ఉండేవాడు. ఫార్చ్యూనర్‌ను రోడ్డుకు 100 మీటర్ల దూరంలో నిలిపి ఉండడంతో సంజయ్ హత్యకు గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆభరణాల విషయంలో సంజయ్ యాదవ్ తన స్నేహితులతో గొడవ పడుతున్నాడని, అందుకే సంజయ్‌ను సజీవ దహనం చేసి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేర్లు వెల్లడించిన తర్వాత ఏ కేసు విషయంలో మరింత మందిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: WhatsApp New Feature: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్!
ग्रेटर नोएडा में बीती ग्राम नगला नैनसुख के पास एक फॉर्च्यूनर कार जली हुई मिली। कार के अंदर एक प्रॉपर्टी डीलर संजय यादव की लाश थी।
संजय अपने घर गाजियाबाद से साइट पर जाने के लिए निकले थे।
संजय दो दोस्तों के साथ निकले थे, आभूषणों को लेकर कुछ विवाद बताया जा रहा है। दोनों दोस्तों… pic.twitter.com/ar8HK4DVD7— Vinay Saxena (@vinaysaxenaj) October 23, 2024
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!