రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది.
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.
నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాకిచ్చాయి. ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు రాజకీయ శరణార్థిగా వెళ్లిపోయారు. డమాస్కస్‌ను రెబల్స్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
Zelenskyy: రష్యా తరఫున తమపై యుద్ధం చేస్తూ మరణించిన నార్త్ కొరియా సైనికుల ముఖాలను గుర్తు పట్టకుండా రష్యా కాల్చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు.
ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఉధృతం అయింది. గత రాత్రి ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం.