ప్రధాని మోడీ తొలిసారి ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ 'చారిత్రాత్మకం' అని అభివర్ణించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలలో భాగమని పేర్కొన్నారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధాలు, వ్యవసాయం, విద్య రంగాలపై మోడీ-జెలెన్స్కీ మధ్య చర్చ జరిగినట్లు జైశంకర్ తెలిపారు.
Ukraine Tour PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21న పోలాండ్‌లో పర్యటించనుండగా., రెండు రోజుల తర్వాత ఆగస్టు 23న యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి వెస్ట్ తన్మయ్ లాల్ ప్రకటించారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ లో అధికారిక పర్యటనకు…