COVID-19: ప్రమాదకరమైన కరోనా వైరస్ మళ్లీ తిరిగి వస్తుందా..? అనే భయాలు మొదలయ్యాయి. కొత్తగా ‘‘స్ట్రాటస్’’ అనే కోవిడ్-19 స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. పలువరు ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఇది వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధకశక్తిని కూడా తప్పించుకోగలదని, అన్ని వయసుల వారికి అక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్‌లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు.