సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పండితులు స్వాగతం పలికారు.
లక్సర్ బోనాలు నిన్న సికింద్రాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తెల్లవారుజామునుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలి బోనం సమర్పించగా, ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈనేపథ్యంలో.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు…
తెలంగాణలో బోనాల పండుగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు ఇప్పుడు లష్కర్‌కు చేరుకున్నాయి.. రేపు అనగా ఆదివారం రోజు లష్కర్ బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. కరోనా మహమ్మారి తర్వాత బోనాలు జరుగుతుండడం.. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో పాటు.. వీఐపీల తాకిడి కూడా ఉండనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు..…