రెబల్ ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపారు ఉద్దవ్ థాక్రే.. రాజకీయ సంక్షోభంలో ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉద్దవ్..
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తీసుకుంది.. శివసేన ఎమ్మెల్యేలు రెండుగా చీలడం… సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం కంటే.. శివసేన రెబల్స్ వర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. సీఎం ఉద్ధవ్ థాక్రే పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది పరిస్థితి.. అసలే కరోనా మహమ్మారిబారిన పడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. కాసేపట్లో సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు… ఇప్పటికే ట్విట్టర్‌లో మంత్రి హోదాను ఆదిత్య థాక్రే తొలగించుకోవడం…