ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత…