Uber: ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం ఊబెర్ విచిత్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇది మన దేశంలో కాదు బెల్జియంలో. వినియోగదారుడి ఫోన్ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఉబెర్ వీటిని ఖండించింది. బెల్జియన్ వార్తా పత్రిక డెర్నియర్ హ్యూర్ లోని ఓ నివేదిక ప్రకారం... తక్కువ ఫోన్ బ్యాటరీ ఉన్న సమయంలో ఉబెర్ ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుందని ఆరోపించింది.
Tata Motors and Uber: ఉబర్ సంస్థ అతిత్వరలో హైదరాబాద్‌లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టనుంది. తద్వారా భాగ్య నగరంలో కాలుష్య నియంత్రణకు తనవంతు కృషి చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరఫరా కోసం ఉబర్ కంపెనీ.. టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ 25 వేల ఎక్స్‌ప్రెస్-టీ మోడల్ వాహనాలను ఉబర్ సంస్థకు అందిస్తుంది. మన దేశంలోని గ్రీన్ మొబిలిటీ సెక్టార్‌లో ఇంత పెద్ద ఒప్పందం కుదరటం ఇదే తొలిసారి. ఉబర్ కంపెనీ…
క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వాటిని ఉపయోగిస్తున్నారు.. కార్లు ఉన్నవారు కూడా కారు తీయకుండా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. బైక్‌లు ఉన్నవాళ్లు, లేనివారు కూడా చాలా సందర్భాల్లో వీటినే ఆశ్రయిస్తున్నారు.. ఉబర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ సేవలు జీవితాలను సులభతరం చేశాయి. అవి సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటాయి.. అంతేకాదు దాదాపు 24/7 అందుబాటులో ఉంటాయి. ఓలా లేదా ఉబర్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకోవడం సాధారణ టాక్సీని తీసుకోవడంతో పోలిస్తే కొన్నిసార్లు చౌకగా…
జీవితంలో తమ బిడ్డలను ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తమ జీవితాన్నే ధారపోస్తుంటారు. అన్ని విషయాల్లో బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతుంటారు. వాళ్ల జీవితంలో సాధించలేకపోయింది పిల్లలు సాధిస్తుంటే దానిని చూసి మురిసిపోతుంటారు. అందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఓ ఉబర్ ఆటో డ్రైవర్ కూడా అలాగే కష్టపడుతున్నాడు.
Uber Cab:క్యాబ్ కంపెనీ ఆరు కిలోమీటర్ల ప్రయాణానికి ఓ యువకుడి నుంచి రూ.32 లక్షలు వసూలు చేసింది. ఇంత భారీ బిల్లు చూసి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న యువకుడి స్పృహ తప్పింది. వెంటనే కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. ఉబర్, ఓలా, ర్యాపిడో అంటూ క్యాబ్, బైక్ సర్వీసులు వచ్చాయి. వెంటనే ఎక్కిడికైనా వెళ్లాలంటే చాలు ఆన్ లైన్లో వాటిని బుక్ చేసుకుని ప్రయాణం…
హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్…
Swara Bhasker కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అయితే ఆమెకు అక్కడి క్యాబ్ డ్రైవర్ అనుకోని షాక్ ఇచ్చాడు. షాపింగ్ చేసిన తర్వాత స్వర ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం అనుకోని విధంగా ఆమె వస్తువులను దొంగిలించడంతో ఖంగుతినడం హీరోయిన్ వంతయ్యింది. ఆ అనుకోని పరిణామానికి…
హైదరాబాద్ లో ఓలా, ఉబెర్ వాహనాలు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. నగరంలో ఎన్ని కొత్త రవాణా యాప్‌లు వచ్చినా ఆదరణ లభిస్తున్నది. నగరంలో ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాలన నుంచి కూడా వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. ఉబెర్, ఓలా యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అయితే, నగరంలో రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వాహానాలను కూడా వినియోగించుకుంటుండటంతో ఆటోవాలాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కీలక నిర్ణయం…
ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు సొంత వాహనం అవసరమే లేదు.. నచ్చిన రైడ్ యాప్‌ను మొబైల్‌లో డౌలేడ్ చేసుకుని.. బైక్, ఆటో, కారు.. ఇలా ఏది బుక్ చేసుకున్నా.. మీరు ఉన్నచోటికే వచ్చి పికప్ చేసుకుని.. గమ్యస్థానానికి చేర్చుతున్నాయి.. క్రమంగా.. ఉబెర్, ఓలా, రాపిడో.. వంటి యాప్స్ తెగ వాడేస్తూ.. గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.. ఇది ముఖ్యంగా సిటీలో ఎక్కువగా జరుగుతోంది.. అయితే, ఈ యాప్స్ ఎక్కువగా వాడుతుంటే మాత్రం.. ఇప్పటికే మీ సమాచారం మొత్తం వారి గుప్పిట్లో ఉన్నట్టే..…