మన తెలుగు రాష్ట్రాల్లో నూనెల కోసం పండిస్తున్న పంటలలో కుసుమ కూడా ఒకటి.. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం, మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి ఈ పంట సాగు తగ్గుతూ వస్తుంది.. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి…