Madras High Court: లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Two Finger Test: ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుల మగతనాన్ని పరీక్షించేందుకు కొత్త సైంటిఫిక్ టెక్నిక్స్‌ని ఉపయోగించాలని, వీలైనన్ని త్వరగా ఈ SOP సిద్ధం చేయాలని, తద్వారా వీర్యం పరీక్ష ప్రక్రియను నిలిపివేయాలని కోర్టు చెబుతోంది.
Two-Finger Test Ban: అత్యాచార నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా డాక్టర్లు అత్యాచార బాధితులను పరీక్షించేందుకు 'రెండు వేళ్ల పరీక్ష' విధానం పాటించడం దురదృష్టకరమని అత్యున్నత న్యాయస్థానం భావించింది.