ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత…
తాలిబన్ల ఎంట్రీతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… దేశాన్ని వదిలి పరారయ్యాడు.. ఇక, అప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్.. చట్టాల ప్రకారం తానే అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్నాడు. మరోవైపు.. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి షాకిస్తూ.. వారి ఖాతాలను నిలిపివేస్తూ.. వారి కంటెంట్‌ను తొలగించేందుకు.. కొత్త కంటెంట్‌పై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక కొత్త టీమ్‌నే ఏర్పాటు చేసింది.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లోనూ వారి కంటెంట్‌పై బ్యాన్ విధించింది ఫేస్‌బుక్.. ఇప్పుడు…
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ…
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు…
ఆ మధ్య వరుసగా కేంద్ర మంత్రులు, బీజేపీ టాప్ లీడర్లకు షాకిచ్చిన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఫోకస్ కాంగ్రెస్ నేతలపై పెట్టినట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే.. మొన్నటి మొన్న రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసిన ట్విట్టర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాను.. ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురు నేతల అకౌంట్లను నిలిపివేసింది.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అజయ్…
భారత మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్టర్ షాకిచింది.. ధోని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది సోషల్ మీడియా దిగ్గజం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ధోనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ట్విట్టర్ లో ధోనిని దాదాపు 82 లక్షల మంది ఫాలో అవుతుండగా.. కెప్టెన్ కూల్ 33 మందిని ఫాలో అవుతున్నారు.. అయితే, ట్విట్టర్ ఈ నిర్ణయం…
ఇప్పటి వరకు ట్విట్టర్‌లో కామెంట్, రీట్వీట్, లైక్, అప్‌లోడ్ బటన్ యాక్టివిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 140 పదాలకు మించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం కుదరదు. ట్వీట్ పెద్దదిగా ఉంటే కొనసాగింపుగా త్రెడ్ ట్వీట్‌ను వేస్తాము. అయితే, ఇప్పుడు ట్విట్టర్ డిస్‌లైక్ బటన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది. కేవలం లైక్ ఆప్షన్ మాత్రమే ఉండటం వలన ట్వీట్ నచ్చని వ్యక్తులు కామెంట్స్ రూపంలో మెసేజ్‌లు చేస్తుండటంతో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అదే డిస్‌లైక్ బటన్‌ను అందుబాటులోకి…
అల్లుడు ధనుష్ మామ రజనీకాంత్ ని కూడా దాటేశాడు! అంతే కాదు, కమల్ హాసన్, విజయ్, సూర్య… కోలీవుడ్లో మరే స్టార్ కూడా ధనుష్ తో పోటీ పడలేకపోతున్నాడు! ట్విట్టర్ లో మన టాలెంటెడ్ యాక్టర్ దూకుడు అలా ఉంది మరి! తమిళంతో మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ దాకా విస్తరిస్తోన్న ధనుష్ సొషల్ మీడియాని కూడా వదలటం లేదు. ట్విట్టర్ లో ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటాడు. ఇంత భారీగా అనుచరులు…
భారత నూతన ఐటీ చట్టాలను పాటించడంలో ట్విట్టర్ మనస్ఫూర్తిగా అడుగులు వెయ్యలేకపోతుంది. ఇప్పటికే పలుమార్లు ట్విటర్ ప్రతినిధులు, కేంద్రంతో చర్చలు జరిపిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక కేంద్రం ఏమాత్రం ట్విటర్ వాదనలు వినదల్చుకోలేదు. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ట్విట్టర్ కు మొట్టికాయలు వేసింది. భారత నూతన ఐటీ చట్టాలను పాటించకుండా ఉండేందుకు ట్విటర్‌కు రక్షణ కల్పించలేమని ఈరోజు విచారణలో తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని…