సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరానికి పురమాయిస్తూ ఉంటారు… తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికి ఇక్కడ కొందరు డబ్బుల కోసం తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ…
తాజాగా “ట్విట్టర్” మరో వివాదంలో చిక్కుకుంది. ఓ “ట్విట్టర్” యూజర్ పోస్ట్ చేసిన తప్పుడు భారత్ చిత్రపటం పట్ల తీవ్ర ఆగ్రహం, ప్రతిస్పందనలు, వెనువెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లడయ్యాయి. “ట్విట్టర్” వెబ్ సైట్ లోని “ట్వీప్ లైఫ్” విభాగం లో పోస్ట్ చేసిన భారత దేశ భౌగోళిక చిత్రపటం లో జమ్మూ కాశ్మీర్, లడక్ భారత్ దేశ అంతర్భాగం కానట్లుగా ఉంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఆ పోస్ట్ లో ఉంది.…
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరోసారి బరితెగించింది… రెచ్చగొట్టే చర్యలకు దిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్‌ను వేరే దేశంగా తన వెబ్‌సైట్‌లో చూపించింది.. ఇక, జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపించింది.. ట్విట్టర్ చర్యలపై సీరియస్‌గా ఉంది భారత ప్రభుత్వం… ట్విట్టర్ గతంలోనూ ఇలాంటి తప్పులే చేసింది.. గత ఏడాది లడాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది.. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే…
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికార ఖాతా పనిచేయకపోవడం చర్చగా మారింది.. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ రూల్స్ తేగా.. ట్విట్టర్ వాటికి అంగీకారం తెలపకపోవడంతో వివాదం మొదలు కాగా.. కొందరు బీజేపీ పెద్దల ఖాతాల విషయంలో ట్విట్టర్ వ్యవహారం కేంద్రానికి మరింత కోపం తెప్పించింది… ఇక, ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోయానని తెలిపారు కేంద్ర మంత్రి…
థియేటర్ల కలెక్షన్ల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు వచ్చి చేరాయి. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్… సంఖ్యను ప్రదర్శిస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైనా స్టార్ హీరో బర్త్ డే వస్తే… కామన్ డీపీ కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అనేది చూడటం ఎక్కువైపోయింది. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ వీడియోస్ విడుదలైనప్పుడూ ఇదే తతంగం. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అతని బర్త్ డే సందర్భంగా ఓ నయా రికార్డ్ ను…
కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య వార్ జరుగుతున్నది. కేంద్రం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. శశిథరూర్ ఆధ్వర్యంలో ఐటీ వ్యవహారాలపై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు ఈ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. Read: రివ్యూ: ఇన్…
ఓవైపు ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. తాజాగా ట్విట్టర్ ఇండియాకు లీగల్ నోటీసులు పంపించారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనలో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించగా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు…
ట్విట్టర్ పై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్దం అవుతున్నది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన తరువాత ట్విట్టర్ తాత్కలిక ఛీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించింది. ఇచ్చిన గడువు లోపల ట్విట్టర్ చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొన్నది. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్దమయింది. అధికారిని ఆలస్యంగా నియమించడంతో భారత్‌లో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్టు కేంద్రం తెలియజేసింది. చట్టపరమైన రక్షణను కోల్పోవడంతో ట్వట్టర్‌పై…
కొత్త ఐటీ నిబంధనలపై ట్విట్టర్ కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4 గంటల లోపు పార్లమెంటుకు వచ్చి ఐటీ చట్టం అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళా భద్రతపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ ప్రతినిధులు శుక్రవారం పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్విట్టర్ ఇదివరకే సానుకూలంగా స్పందించినప్పటికీ…