టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ చివరి దశకు చేరుకుంది… శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌చేశారు మస్క్.. అయితే, మస్క్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. ఆ వీడియోలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోకి ఓ సింక్‌ను మోసుకెళ్తున్నారు.. ఇది ఆయన సెంటిమెంట్…