కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తన ట్విట్టర్ బయోను"మెంబర్ ఆఫ్ పార్లమెంట్"గా మార్చారు. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసుపై దిగువ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత రాహుల్‌గాంధీ బయో గతంలో "డిస్ క్వాలిఫైడ్ ఎంపీ" అని ఉండేది.