మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి.…