తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్.. కరూర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట విషాదాంతంగా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం, గాయపడడం తనను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. అటువంటి సంఘటనలకు దారితీసిన విస్తృత సామాజిక సమస్యలపై ప్రస్తావించారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాల నుండి ఆత్మపరిశీలన చేసుకోవాలని పిలుపునిచ్చారు.…
TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Karur Stampede at Vijay’s TVK Rally: తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలు సైతం ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంతలో తొక్కిసలాట గురించి ముఖ్యమైన సమాచారం వెలువడుతోంది. ర్యాలీలో జనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. విజయ్ షెడ్యూల్ చేసిన సమయం కంటే…
Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ నేతృత్వంలో జరిగిన మెగా రాజకీయ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కనీసం 31 మంది మరణించారని సమాచారం. హాజరైన వారిలో చాలా మంది కుప్పకూలిపోయారని తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించారు. "పోలీసులు, దయచేసి సహాయం చేయండి"…
Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
TVK rally tragedy: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సంచలనంగా మారారు. గురువారం తమిళనాడు మధురైలో తమిళగ వెంట్రీ కజగం పార్టీ రెండవ వార్షికోత్సవ సభ విజయవంతం అయ్యింది. కానీ సభకు వచ్చిన వారిలో సుమారుగా 400 మంది విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 12 మంది పరిస్థితి విషయంగా ఉంది. పార్టీ రెండో మనాడును పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏర్పాటు…