India On Turkey: పాకిస్తాన్‌కి ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. టర్కీకి బలమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది.