Turkey Earthquakes: భారీ భూకంపాల ధాటికి టర్కీ కుదేలైంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 11,200 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచదేశాలు
టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది.
టర్కీ, సిరియాలను వరుస భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరో రెండు భూకంపాలు సంభవించడం ఆందోళన కల్గిస్తోంది.