HYDRA : హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు.…