Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
పాకిస్తానీ తాలిబన్‌కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు.
Suicide blast in Pakistan's Islamabad: దాయాది దేశం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన, దేశ పార్లమెంట్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వెళ్లే దారిలో ఈ ఘటనల జరగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళం ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ పేలుడులో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారు. మరణించిన పోలీస్…
సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో వరుసగా మూడోసారి పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచినట్లు యూఎస్ థింక్ ట్యాంక్ ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తాజాగా అంచనా వేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ద్వారా పెరుగుతున్న హింసతో సహా పలు భద్రత, మానవ హక్కుల సవాళ్లను పాకిస్థాన్ ఎదుర్కొంటుందని ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ తన 28 పేజీల నివేదికలో పేర్కొంది.