IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా…
Pakistan: ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Afghanistan Pakistan conflict, TTP attacks, Pakistan soldiers killed, Mir Ali suicide bombing, Waziristan terror attack, Kabul airstrike, Taliban Pakistan war, cross-border clashes, Afghanistan ceasefire
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్‌లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది.
Pakistan Crisis: దాయది దేశం పద్మవ్యూహంలో చిక్కుకుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ మాస్టర్ వ్యూహకర్తగా ఉండటానికి ఉత్సాహపడుతుందని, కానీ ఆ దేశానికి అది సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం పాక్‌కు భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది, మరోవైపు బలూచిస్థాన్, ఖైబర్-పఖ్తుంఖ్వాలో రెండు అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి. ఈ సవాళ్లు అనే పద్మవ్యూహంలో పాక్ సైన్యం చిక్కుకోడానికి అనేక పాపాలు చేసిందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా దాయది దేశం డబుల్…
Pakistan Balochistan Operation: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గత రెండు రోజుల్లో పాకిస్థాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (ISPR) శనివారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆగస్టు 7 – 8 మధ్య రాత్రి జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 33 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8 – 9 రాత్రి ఆఫ్ఘనిస్థాన్…