తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లాయా?, ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా పూర్తిస్థాయి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్తాయని, NABL తర్వాత కూడా టీటీడీ ల్యాబ్‌లో టెస్టులు కూడా పాస్ కావాలని, ఆ…
YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు.
టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం…
గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి…
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..? బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు…
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..! అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై…
కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తిరుపతి వెళ్లామంటే.. వెంటనే లడ్డూ తెచ్చారని అడుగుతుంటారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ, తెలంగాణలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.. మరోవైపు.. శ్రీనివాసమంగాపురంలోనూ లడ్డూ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది టీటీడీ.. రేపటి నుంచి శ్రీనివాసమంగాపురంలో లడ్డూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలను…