Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు.
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై అధికారులు చర్యలు చేపట్టారు. క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉద్యోగ నియమాలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అధికారుల నివేదికలో పేర్కొనడంతో, వారిపై టీటీడీ ఈవో సస్పెన్షన్ వేటు వేశారు.