కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వర్షాల వల్ల ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1వ తేదిన 16వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో…
తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా తిరుమల వచ్చిన వీఐపీలకే దర్శనం కల్పిస్తామన్నారు. చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదన్నారు. Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తిరుమలలో గదుల మరమ్మతుల కారణంగా ఏకాదశి…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా గతంలో దర్శనాలు పరిమితం చేశారు. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తిరుమలకు వెళ్ళే దారుల్లో కొండచరియలు విరిగిపడడం, నడక దారి పాడవడంతో భక్తులు తగ్గారు. తిరుమలలో ఆదివారం భక్తులు బాగా పెరిగారు. ఆదివారం కావడం వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల భక్త జనసంద్రంగా మారింది. శ్రీవారిని 36162 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పాలి.…
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన…
బుధవారం రోజు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాలను వారం రోజుల పాటు వాయిదా వేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. దర్శనం టిక్కెట్లను రీ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చని సూచించారు. Read Also: విరిగిపడ్డ కొండ చరియలు.. ఘాట్ రోడ్డు…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన తెలిపారు.…
ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్‌గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాదిన ఢిల్లీ,…
తిరుపతి నగర వాసులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త అందించారు. తిరుపతికి వచ్చే యాత్రికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు చేపట్టిన శ్రీనివాస సేతు (గరుడ వారధి)ని నవంబరులో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఆఫ్ కాన్ సంస్థ ప్రతినిధి రంగ స్వామి ఇతర అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. Read Also: తెలుగుకి ఇప్పుడు…
తిరుమల : రేపటి నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ లకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపింది. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేసింది. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్…
తిరుమల : 25 వ తేది నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేశారు. 26 తేదీ నుంచి…