తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా తిరుమల వచ్చిన వీఐపీలకే దర్శనం కల్పిస్తామన్నారు. చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదన్నారు.
Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
తిరుమలలో గదుల మరమ్మతుల కారణంగా ఏకాదశి రోజున ప్రజాప్రతినిధులుకు నందకం, వకుళామాత వసతి భవనంలో గదులు కేటాయింపు ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒకవేళ తిరుమలలో అవకాశం లేకపోతే తిరుపతిలో గదులు కేటాయిస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు తిరుపతిలో వసతి గదులు కేటయిస్తామని వెల్లడించారు.