తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన…