హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో TSRTC యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో నివాసం ఉంటున్న అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.…
Telangana Elections: చెదురుముదురు సంఘటనల మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు.
Karimnagar: ప్రతి ఏడాది అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తరువాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు. అయితే కేరళ లోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులు ప్రయివేట్ బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. కానీ కార్తీక మాసంలో హిందువుల్లో చాలామంది అయ్యప్ప మాలను ధరిస్తారు. కనుక…
TSRTC: తెలంగాణలో దసరా పండుగ ధూంధాంగా జరిగింది. ఈ దసరా పండుగ టీఎస్ ఆర్టీసీకి కోట్ల రూపాయల వర్షం కురిపించింది. దసరా పండుగ సందర్భంగా TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి.
Dussehra Festival: దసరాకు ముందు హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, నగర శివారు ప్రాంతాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోవడంతో చాలా మంది నగరవాసులు తమ సొంత వాహనాలను ప్రయాణానికి వినియోగించుకోవాల్సి వచ్చింది.
Conductor Srividya: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోలు బండ్లగూడ బస్ డిపోలో మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. అధికారుల వేధింపులు భరించలేక మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య(48) ఆత్మహత్య చేసుకుంది.
Hyderabad: ఆపద వచ్చినప్పుడు దిగులు పడితే, భయపడి చేతులు ఎత్తేస్తే, ఇతరుల గురించి ఆలోచించకుండా స్వార్థంతో ఆ ప్రమాదం నుంచి బయటపడితే అది హీరో లక్షణంగా అనిపించదు.