కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు. మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.’ అని ఆయన ట్వీట్టర్ (X) వేదికగా పేర్కొన్నారు. ఊరెళ్దామని కరీంనగర్…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. అధికారికంగా బుధవారం రోజు దీనిపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) పేరు మార్చబడింది. ఆర్టీసీ సంస్థ TSRTC పేరు TGSRTC గా మార్చబడిందని సంస్థ ఎండీ సజ్నార్ X వేదికగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఎస్‌ఆర్‌టీసీ పేరును టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్చారు. దీని ప్రకారం, X యొక్క అధికారిక ఖాతా కూడా TGSRTCకి మార్చబడింది. ప్రయాణీకులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఫిర్యాదులను సవరించిన వినియోగదారు ఖాతా ద్వారా తెలియజేయాలని ఎండీ సజ్నార్ అభ్యర్థించారు. TGSRTC అందించే…
RTC MD Sajjanar: రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను పెట్టుబడిగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో తెలంగాణ ముందంజలో ఉంది. సైబర్ నేరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 15 వేల 297 కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు? ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నేరాలు ఆగడం లేదు.…
TSRTC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి విధులకు హాజరుకావద్దని ఆదేశాలు జారీ చేశారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, డెనిమ్ ప్యాంట్‌లతో విధులకు వస్తున్నప్పటికీ.. ఈ తరహా దుస్తులు సంస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది…
TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు.
వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు…
TSRTC: సమ్మర్ సీజన్ మొదలైంది. అటు కాలేజీలకు ఇటు స్కూల్స్ కు సెలవు ప్రకటించడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంటారు. పుణ్యక్షేత్రాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి, శ్రేశైలం.
నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారు. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు లీవ్ పొజిషన్…