VC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. అధికారికంగా బుధవారం రోజు దీనిపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. దీనిపై TGSRTC కొత్త లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు అధికారికంగా కొత్త లోగోను సంస్థ రిలీజ్ చేయడలేదని వెల్లడించారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ నెట్టింట ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అని కొట్టిపారేశారు.
Read Also: Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు నిక్కీ హేలీ మద్దతు
కాగా ఆ లోగోతో టీజీఎస్ఆర్టీసీ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుంది.. ఆ కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ ఎక్స్ ( ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. అత్యుత్సాహంతో కొంత మంది అలా లోగోను డిజైన్ చేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో అదే నిజమైన లోగో అంటూ సోషల్ మీడియా వైరల్ అయ్యింది.. టీజీఎస్ఆర్టీసీ ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 23, 2024